ఎక్కడో ఉన్న నేను అతన్ని ప్రేమించాను
కోటలోకి నాకు ఆహ్వానం పలికాడు
తెలియని కొత్త చోటు అయినా ప్రేమించాను
నా చుట్టూ బంగారు ఇటుకల అలంకారం
బందీ అయిన స్వేచ్చ, అయినా నేను ప్రేమించాను
ముత్యాల సరాలతో అలంకరించాడు
ఊపిరాడక నేను తల్లడిల్లా
అయినా ఆశతో మరింత ప్రేమించాను
రత్న రాశులతో నన్ను మెరుగులు దిద్దుతున్నాడు
ఊపిరి ఆడక నేను అక్కడే ఆగిపోయాను
అయినా అతను అలంకరిస్తూనే ఉన్నాడు
ఇంకా ఇంకా అలంకరిస్తూనేవున్నాడు